పాము కలలో వస్తే అర్థాలే వేరు
posted on Dec 6, 2024 1:52PM
జాఫర్ బయ్ అర్ధాంగికి కలలో పాములు వస్తున్నాయి. నాకు ఎవరో చేతబడి చేస్తున్నారు అందుకే కలలో పాములు వస్తున్నాయి అని అనుమానం వ్యక్తం చేసింది కుబ్రాబేగం. పరిష్కారం కోసం భార్య భర్తలు ఇరువురు మౌలానా దగ్గరికి వచ్చారు.
జాఫర్ బయ్ దంపతులు: సలాం వాలేకూం మౌలానా సాబ్
మౌలానా: వ “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు”తశ్ రీప్ రఖియే.
జాఫర్ బయ్: మౌలానా సాబ్ ఇంట్లో ఎవరికైనా కలలో పాములు వస్తే ఏమవుతుంది. ఎవరైనా చేత బడి చేశారా ?
మౌలానా: కలలో పాములు రావడం సహజమే. ఇస్లాం ప్రకారం కలలో పాము కనిపిస్తే ప్రతీ ముస్లిం కూడా భయపడాల్సిన పని లేదు. అల్లాకు మాత్రమే భయపడాలి. ధర్మ కార్యాలు నెరవేర్చాలి. పదే పదే కలలు వస్తే నమాజు విధిగా ఆచరించాలి. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే దిన చర్యే రాత్రి పూట కలలకు కారణం. ప్రతీ రోజు ఎవరికైనా తరచూ పాము కలలోకి వస్తే ఆ వ్యక్తికి శత్రువు ఉన్నట్టు. ఒక వేళ పామును చంపేసినట్టు కల వస్తే శత్రువు చనిపోయినట్టు అర్థం చేసుకోవాలి. ఇంట్లో పాము కనిపిస్తే శత్రువు ఇంట్లోనే ఉన్నట్టు అర్థం. ఇంటి వెలుపల పాము కనిపిస్తే శత్రువు ఇంటి వెలుపల ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. పామును చంపేసి దాని మాంసాన్ని తిన్నట్లు కలలు వస్తే శత్రువు సంపదను పొందినట్టుగా భావించాలి. కలలో చనిపోయిన పాము కనిపిస్తే ఆ వ్యక్తి బాధలు తొలగిపోయినట్టు అర్థం. పాము మంచం మీద చనిపోయినట్టు కల వస్తే ఆ వ్యక్తి భార్య చనిపోతుందని అర్థం
బదనపల్లి శ్రీనివాసాచారి