జూన్6న అమరావతికి శంఖుస్థాపన

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి జూన్ 6న ఉదయం 8.49 గంటలకు శంఖుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి రాజధాని అమరావతి నగర నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించవచ్చునని తెలుస్తోంది. అదే విధంగా ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu