యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్  శుక్రవారం (జూన్ 27) తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె వయస్సు 35 ఏళ్లు. ఆమెకు స్కూలుకు వెళ్లే వయస్సున్న కుమార్తె ఉంద. ఆమె ఆత్మహత్యకు కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది.  

పోలీసులు  కేసు నమోదు చేకుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణానికి ముందు తాను ధ్యానం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతలోనే ఆత్మహత్య చేసుకోవలసిన కారణమేమిటన్నది తెలియాల్సి ఉంది.