అనంత జడ్పీ ఛైర్మన్‌గా పూల నాగరాజు ఏకగ్రీవం

అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పూల నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడచిన మూడేళ్లుగా చమన్ ఛైర్మన్ పీఠంపై ఉండగా..ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పుడు నాగరాజును ఆ పదవి వరించింది. నేటి ఉదయం ఛైర్మన్ ఎన్నిక కోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు..జెడ్పీ సీఈవో శోభా స్వరూపరాణితో కలిసి జాయింట్ కలెక్టర్ రమామణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నానినేషన్‌కు ఇచ్చిన సమయంలో పూల నాగరాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో..ఆపై మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్వరూపరాణి ప్రకటించారు. ఈ ఎన్నికకు వైసీపీ నుంచి ఎన్నికైన ఇద్దరు జడ్పీటీసీలు హాజరుకాకపోవడంతో నాగరాజు ఎన్నిక సాఫీగా సాగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu