మోడీ స్థానంలో గుజరాత్ సీఎంగా ఆనందీ బెన్?

 

 

 

నరేంద్రమోడీ భారతదేశ ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? ఈ బాధ్యతలు ఒక మహిళకు దక్కనున్నట్టు తెలుస్తోంది. మోడీ స్థానంలో సీఎం కావాలని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలామంది కలలు కంటున్నారు. వీరిలో సౌరభ్ పటేల్, నితిన్ పటేల్ ప్రధానంగా వున్నారు. అయితే గుజరాత్ తదుపరి సీఎం రాష్ట్ర రెవిన్యూ మంత్రి ఆనందిబెన్ పటేల్ అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మోడీ మద్దతు కూడా ఈమెకే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఆనందీ బెన్ పటేల్ 1941 నవంబర్ 21న జన్మించారు. ఆమె వయస్సు 72. బిజెపిలో ఆమె వివిధ హోదాల్లో, ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆనందీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కోటీశ్వరురాలు కూడా కాదు. రైతు కుటుంబానికి చెందిన మహిళ. అయితే పట్టుదల, ధైర్యం, యోగ్యత.. తదితరాలు ఆమెను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఆమెది రాజీపడే తత్వం కాదని పరిశీలకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu