జ్యుడీషియల్ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్.. ఛలో తీహార్ జైల్
posted on May 21, 2014 4:16PM
.jpg)
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌ని దరిద్రం పట్టుకున్నట్టుంది. బంగారం లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని వదిలేశాడు. మొన్న జరిగిన ఎన్నికలలో ఢిల్లీలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. తాజాగా ముఖ్యమంత్రి పదవిని వదిలేసి చాలా తప్పు చేశానని కేజ్రీవాల్ చెంపలు వేసుకున్నాడు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయకండని, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని ప్రకటించాడు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి కేజ్రీవాల్‌కి మద్దతు ఇచ్చే ఛాన్సే లేదని ప్రకటించేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కేజ్రీవాల్ వున్నాడు.
అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌కి మరో తలనొప్పి వచ్చిపడింది. బీజేపీ నాయకుడు గడ్కరి దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కి మే 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు జ్యుడీషియల్ కస్టడీ రాకుండా చేసుకోవాలని కేజ్రీవాల్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. రెండు రోజుల పాటు ఆయన తీహార్ జైల్లో వుండక తప్పదు.