అమరావతి.. ఇక ఆగేదేలే?
posted on Jun 18, 2025 10:38AM
.webp)
నవ్యాంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అభివృద్ధిలో ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకుపోతోంది. జగన్ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమరావతి పురోగతిని ఆపేశారు. శ్మశాసమంటూ ఎద్దేవా చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులకూ గురి చేశారు. అటువంటి అమరావతిలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున నిర్మాణాలు జోరందుకున్నాయి. అటు కేంద్రం ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది. రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను స్వయంగా చేపట్టడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్లను, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను కూడా కేంద్రమే నిర్మించేందుకు ముందుకు వచ్చింది కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి. దీంతో అమరావతి పురోగతికి అడ్డు అన్నదే లేకుండా పోయింది. ఇందుకు అదనంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాలను కేంద్రమే స్వయంగా తన నిధులుతో నిర్మించేందుకు ముందుకు వచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్వర్లులు జారీ చేశారు. ఆ వెంటనే ఆ నిర్మాణాలకు అవసరమయ్యే నిధులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుద చేసేసింది. ఈ నిధుల విడుదల విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి 1,329 కోట్ల రూపాయలు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి .1,459 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం ఈ నిర్ణయంతో అమరావతి నిర్మాణం నిర్దుష్టకాలంలో పూర్తి కావడమే కాకుండా, ఇక ఏ శక్తీ దీనిని నిలువరించలేదని కూడా స్పష్టమైంది.