కావాలనే చర్చలో అమరావతి ప్రస్తావన : ప్రెస్ అకాడమీ ఛైర్మన్
posted on Jun 9, 2025 5:16PM

ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్‌కుమార్ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఇలా మాట్లాడినట్లు తెలుస్తోందన్నారు. చర్చలో ఆ సందర్బానికి జోడించారో వివరణ ఇవ్వాలని కోరారు. రాజకీయ నేతలు నడిపించే మీడియా వద్దు అనే చర్చ ప్రారంభం కావాలన్నారు.
యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరినీ క్షమాపణ కోరలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో కొందరికి బాధ కలిగి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఛానల్‌ను నడుపుతున్న యాజమాన్యం ఎవరో అందరికీ తెలుసు. ఇంత చౌకబారు జర్నలిజం ఎందుకు వచ్చిందో అలోచించాలని ఆయన ప్రశ్నించారు. వారి పార్టీ అజెండా కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. ఆంగ్లపత్రిక కథనంలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదు. చర్చలో ఆ సందర్భాన్ని ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. రాజకీయాలు జోడించాల్సిన అవసరం ఎవరికీ లేదు.’’ అని ఆలపాటి పేర్కొన్నారు.