అఖిల ప్రియకు అస్వస్థత.. వడదెబ్బ అన్న వైద్యులు
posted on Jun 9, 2025 5:31PM

తెలుగుదేశం నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెకు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు.
అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించిన అనంతరం కోలుకున్నారు. రెండు రోజులుగా అఖిలప్రియ జాతరకు సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక సోమవారం (జూన్ 10) పూజల సందర్భంగా ఉపవాస దీక్ష పాటించారు. అసలే ఎండలు, ఉక్కపోత ఉండటం, ఉపవాసదీక్షలో ఉండటంతో నీరసించి సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.