ఏపీ శంకుస్థాపన.. జయలలిత కూడా ఆ లిస్ట్ లో
posted on Oct 21, 2015 12:25PM
.jpg)
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ నేతలు చాలా బిజీగా ఉన్నారు. ఈకార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ.. సింగపూర్, జపాన్ ప్రధానులతో పాటు పలువురు ప్రముఖులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆహ్వానించారు. అయితే చంద్రబాబు తాను పిలవడానికి అయితే పిలిచారు కాని కొంతమంది మాత్రం తమ బిజీ షెడ్యూల్ తో రావట్లేదని చెపుతున్నారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని.. బాబుకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అయితే అఖరిలో కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నానని ట్విస్ట్ ఇచ్చారు.