అమరావతి నిర్మాణంపై దిగ్విజయ్ అనుమానాలు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు, నయారాయపూర్, ఛండీగఢ్, గాంధీనగర్,  అహ్మదాబాద్, డెహ్రాడూన్ వంటి కేపిటల్ సిటీస్ ను స్వదేశీ కంపెనీలే నిర్మించాయని, కానీ చంద్రబాబు మాత్రం విదేశీ కంపెనీల వెంటపడుతున్నారని మండిపడ్డారు, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని 99ఏళ్ల లీజుకు విదేశీ కంపెనీలకు కట్టబెట్టడం దారుణమన్న దిగ్విజయ్... అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వస్తాయని అనుకోవడం లేదన్నారు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ మాత్రమే పోరాటం చేస్తోందన్న డిగ్గీ.... చంద్రబాబు, జగన్ లు ప్రధాని మోడీని ప్రశ్నించడం లేదన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu