నిర్మాత అవతారం ఎత్తనున్న బన్నీ
posted on Nov 25, 2013 2:50PM
.jpg)
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు తన నటన మీదనే దృష్టి పెట్టాడు. అప్పుడప్పుడు మధ్యలో ఏవో కొన్నికమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపిస్తుంటాడు. అయితే త్వరలో తను నటించబోయే సినిమాకి సహా నిర్మాతగా మారనున్నాడు. ఈ సినిమాను గతంలో తనతో ‘జులాయి’ సినిమాని నిర్మించిన యస్.రాధాకృష్ణతో కలిసి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా మరో సహ నిర్మాతగా వచ్చి జేరారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘అత్తారింటికి దారేది’ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘రేసు గుర్రం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. బహుశః అది పూర్తవగానే ఈ కొత్త సినిమా ఆరంభించవచ్చు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా హీరోయిన్, సాంకేతిక నిపుణులను ఇంకా ఖరారు చేయవలసి ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమా త్వరలో షూటింగ్ ఆరంభించ గలిగితే వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలుంటాయి.