పెళ్లి చూపించబోతున్న చైతు...!

 

"గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో హిందీలో సూపర్ హిట్టయిన "సింగ్ వర్సెస్ కౌర్" చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం రుపొందబోతుంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఎనిమిది నెలల పాటు శ్రమించిఈ కథను సిద్ధం చేశాం. "గుండెజారి గల్లంతయ్యిందే" కంటే రెండింతలు ఎక్కువ వినోదం ఉండబోతుంది. ఈ సినిమా చూశాక బంధువుల పెళ్ళికి వెళ్లోచ్చిన అనుభూతి కలుగుతుంది. నాగచైతన్యను కొత్తగా చూపించబోతున్నాం. డిసెంబర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభించనున్నామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu