కమలకు అవార్డు ఖాయం...!

 

శివాజీ, అర్చన జంటగా నటించిన చిత్రం "కమలతో నా ప్రయాణం". నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా కష్టపడ్డారు. అర్చన తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఒకవేళ ఎటువంటి రాజకీయాలు జరగకపోతే... ఈ సినిమాతో అర్చనకు అవార్డు రావడం ఖాయం అని అన్నారు. "అర్చన లాంటి ప్రతిభ ఉన్న హీరోయిన్లు తెలుగులో చాలామంది ఉన్నారు. వారికి సరైన అవకాశాలు రావట్లేదు. మనం కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. ఉత్తరాది వారిని కాకుండా తెలుగు వారిని ప్రోత్సహించే ధోరణి రావాలని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu