కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి విజయం

కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జయకేతనం ఎగురవేసింది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందరప్రసాద్ 80 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆలపాటి రాజాకు  లక్షా 45 వేల 57 ఓట్లు   పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62 వేల 737 ఓట్లు వచ్చాయి.

పోలైన మొత్తం ఓట్టు రెండు లక్షల 41 వేల 491 కాగా, వీటిలో 26 వేల 679 ఓట్లు చెల్లలేదు. అయితే చెల్లిన ఓట్లలో దాదాపు 60 శాతం ఆలపాటి రాజాకే పడ్డాయి. ఓట్ల లెక్కింపు ఆరంభమైన క్షణం నుంచి ఆలపాటి రాజా ఆధిక్యంలోనే ఉన్నారు.   తనకు ఇంతటి భారీ విజయం చేకూరడానికి కారణమైన కూటమి  కార్యకర్తలకు గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రులకు ఆలపాటి రాజా కృతజ్ణతలు తెలిపారు.  పట్ట భద్రులు ప్రగతికి, అభివృద్ధికి ఓటు వేశారని ఆలపాటి రాజా అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu