వృద్దురాలిని తిప్పలు పెట్టిన ఎయిర్ ఇండియా... వీల్ ఛైర్లోనే ఉంటుందని
posted on May 16, 2016 6:17PM

అధికారులకైతే సలాం చేస్తూ.. ఎక్కడ ఏ సీటు కావాలన్న ఇచ్చే ఎయిర్ ఇండియా వాళ్లు.. అదే సామాన్య ప్రజలైతే మాత్రం తమ నిర్లక్ష్య వైఖరి చూపిస్తుంటారు. కేవలం వృద్ధురాలు అన్న కారణంతో రాజేష్ శుక్లా అనే అనే ఆమెను ఏడు గంటలు ఎయిర్ పోర్టులోనే ఉంచారు. అది కూడా చాలా సిల్లీ కారణం చెప్పి.. వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన రాజేష్ శుక్లా అనే వృద్ధురాలు తన కూతరు న్యూయార్క్ల్ లో ఉండగా.. అక్కడికి వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుంది. అయితే ఎయిరిండియా సిబ్బంది ఆమెను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఓవర్ లోడ్ అయిందంటూ దించేశారు. దీంతో ఆమె ఏడు గంటలు అక్కడే వెయిట్ చేసింది. ఈవిషయాన్ని ముంబైలోని ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మరో కూతురికి తెలపడంతో ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీయడంతో వెంటనే ఆమెను వేరే ఫ్లయిట్ లో ఢిల్లీ నుండి లండన్ కు, అక్కడి నుండి న్యూయార్క్ కు పంపిచారు. దీంతో 15 గంటల ప్రయాణం కాస్త 20 గంటలు పట్టింది. అయితే ఎయిరిండియా వాళ్లు ఫ్లైట్ లో ఖాళీ లేకే దించేశామని చెబుతున్నా... అది అసలు కారణం కాదని అంటోంది కూతురు. తన తల్లి నడవలేదని, వీల్ ఛైర్లోనే ఉంటుందని, ఆ వీల్ ఛైర్ కూడా ఇవ్వలేక ఆమెను విమానంలోకి ఎక్కనివ్వలేదని ఆరోపిస్తోంది.