అగస్టా పై పారికర్.. 4న అంతా బయట పడుతుంది..
posted on May 1, 2016 2:31PM

అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ కుంభకోణంలో సోనియా గాంధీపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ లో కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈకేసు వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగికి ఈడీ సమన్లు జారీ చేసింది కూడా. అయితే ఇప్పుడు దీనిపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మరో విషయం వెల్లడించారు. 4వ తేదీన పూర్తి వివరాలతో కూడిన దస్త్రాలన్నింటినీ పార్లమెంట్ లో ప్రవేశపెడతానని, దాంతో ఎవరి తప్పెంతన్నది తేలుతుందని ఆయన అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తుంది. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు మరోసారి అగస్టా కుంభకోణాన్ని బీజేపీ వెలుగులోకి తీసుకురాగా, పూర్తి విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.