పవన్ పై వర్మ సెటైర్లు... గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ వద్దు..
posted on May 1, 2016 2:06PM
.jpg)
ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంపై ట్విట్లర్లో ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. మరోసారి తనదైన శైలిలో సెటైర్ వేశారు. పవన్ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుక్కోవడం మానాలని.. పవన్ గబ్బర్ సింగ్ అని, బెగ్గర్ సింగ్ కావొద్దని వివాదాస్పదవ్యాఖ్యలు చేశాడు. వీరుడు అడుక్కోకూడదని, ఏ కాపులకైతే మీరు పవర్ ఇచ్చారో.. వాళ్లని మీ విన్నపాలతో బీదవాళ్లను చేశారని వ్యాఖ్యానించాడు. అరే కెసిఆర్‌లా నీ తాట తీస్తాననే పవర్ హీరో మాకు కావాలి. విన్నపాలు కోరే పవర్ లేని స్టార్‌లు వద్దని వ్యాఖ్యానించారు. డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాని.. విన్నపాలు చేస్తే ప్రత్యేక హోదా రాదని అన్నారు.