షీలా దీక్షిత్ రాష్ట్రపతిని ఎందుకు కలసినట్టో...
posted on Aug 26, 2014 11:12AM
.jpg)
తన గవర్నర్ పదవికి రాజీనామా చేయనని భీష్మించుకుని కూర్చున్న మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ తనను త్రిపురకు బదిలీ చేయడంతో రాజీనామా చేసేశారు. ఇప్పుడు అదే విధంగా భీష్మించుకుని కూర్చున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సోమవారం నాడు ఢిల్లీకి వచ్చి మొదట కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఎన్డీయే ప్రభుత్వం ఆమెని పదవి నుంచి వైదొలగాల్సిందిగా మౌఖికంగా ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె హోం మంత్రిని, రాష్ట్రపతిని కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. షీలా దీక్షిత్ తన పదవికి రాజీనామా చేయడం కోసం గవర్నర్ని కలిశారా.. లేక ఎన్డీయే ప్రభుత్వంతో రాజీపడే ఉద్దేశంతో కలిశారా అనేది సస్పెన్స్‌గా వుంది.