తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. దర్యాప్తు వేగం పెంచిన సిట్.. ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్

లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తులో భాగంగా నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ దక్కించుకున్న తమిళనాడు రాష్ట్రం దిండుగల్ కు చెందిన ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయలేదని తేలింది. మరి ఏం జరిగింది అంటే.. నెయ్యి ని ఉత్తరాఖండ్   రూర్కీలోని బోలేబాబ డైరీ నుంచి కొనుగోలు చేసి తిరుపతి జిల్లా లోని వైష్ణవి డైరీకి తరలించారు.  అక్కడ ఏఆర్ డైరీ సీల్   వేసి టీటీడీకి సరఫరా చేశారు. ఈ విషయం దర్యాప్తులో తేలడంతో సిట్ అధికారులు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.  

అసలు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలుత ప్రకటించారు. ఒక సభలో ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ప్రకటించారు.   హిందువులు ఆరాధ్యదైవం అయిన తిరుమల వేంకటేశ్వరస్వామి. ఈ శ్రీవారి దర్శన భాగ్యం అదృష్టంగా భక్తులు భావిస్తారు. అంతే అదృష్టంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.  అందుకే స్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు అత్యంత ప్రీతిపాత్రం అయ్యింది.  స్వామి వారి దర్శనం లేకపోయినా లడ్డూ ప్రసాదం లభిస్తే స్వామి వారి దయ ఉన్నట్లేనని భావిస్తారు. అలాంటి ప్రసాదం అపవిత్రం చేస్తూ జగన్ హయాంలో లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ అయిందనిృ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సభా ముఖంగా ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగుదశం కూటమి పార్టీలూ, వైసీపీల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది.

అయితే  ఈ కేసులో సిట్ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమౌతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించి.. ప్రత్యేక దర్యాప్తు బృందం సీబీఐ ఆధ్వర్యంలో జరగాల్సిందేనని ఆదేశించిన సుప్రీం కోర్టు కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడా ప్రత్యేక సిట్ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.   సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో 12 మంది పేర్లు ఉన్నాయని చెబుతున్నారు.  ఏ1 గా ఏఆర్ డైరీ, ఏ2 గా ఆ సంస్థ ఎండీ రాజు రాజశేఖరన్, ఏ3గా పొమిల్ జైన్,  ఏ4గా  విపిన్ జైన్, ఏ5 అపూర్వ చవాడాలను చేర్చింది. ఈ ఆరుగురినీ సిట్ పలుమార్లు విచారించింది.  సిట్ అరెస్ చేసి పలు దఫాలు విచారణ చేశారు. ఏ6 బోలేబాబ డైరీ, ఏ7 వైష్ణవి డైరీని చేర్చారు. ఏ8 వైష్ణవి డైరీ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షబిల్ కలీముల్లాఖాన్ తో  పాటు టీటీడీ ప్రొక్యూర్ మెంట్ ఉద్యోగి, బోలేబాబ సీజీఎం, నెయ్యి ముడిపదార్ధాలు సరఫరా చేసే వారిని ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. త్వరలో మరింత మందిని విచారణ చేసే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu