పెళ్లయిన మూడు రోజులకే ఆర్మీ జవాన్‌కు పిలుపు.. నా సిందూరాన్ని పంపుతున్నా భార్య ఉద్వేగం
posted on May 10, 2025 2:38PM
.webp)
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా వివాహ సెలవులకు ఇంటికొచ్చిన జవాన్‌కు పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు వచ్చింది. దీంతో పెళ్లయిన మూడు రోజులకే భార్యను వదిలి విధుల కోసం దేశ సరిహద్దుకు వెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న పెళ్లి జరిగింది. అయితే, మంగళవారం యుద్ధంలాంటి పరిస్థితిలో, వెంటనే విధులకు హాజరు కావాలని అతనికి ఆదేశం వచ్చింది.
ఆ ఆదేశం మేరకు మే 8న బార్డర్‌కు బయలుదేరాడు. జవాన్ పాటిల్‌కు వీడ్కోలు పలికేందుకు నూతన వధువు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పచోరా రైల్వే స్టేషన్‌కు వచ్చారు. దేశాన్ని రక్షించడానికి తన సిందూరాన్ని పంపుతున్నానని నూతనవధువు యామిని పాటిల్ కు వీడ్కోలు పలుకుతూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.