అభిమానులకు బాలకృష్ణ వివాహ ఆహ్వానం
posted on Aug 19, 2013 12:01PM
.jpg)
ప్రముఖ నటుడు, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహ నిశ్చితార్థం బాలయ్య ఇంట్లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 21వ తేదీ ఉదయం 8:52 గంటలకు వివాహం జరపనున్నారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
'నా చిన్నకుమార్తె తేజస్విని వివాహానికి నా అభిమాన సంఘాల సభ్యులంతా రావాలి' అని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ''ఈ ప్రకటననే వ్యక్తిగత ఆహ్వానంగా పరిగణించి అభిమాన సంఘాల సభ్యులంతా వచ్చి వధూవరులను ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించాలి'' అని కోరారు. తేజస్విని కుటుంబంతో పాటు అటు వరుడు భరత్ కుటుంబం కూడా సామాజికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలు కాబట్టి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది.