దీర్ఘకాలిక గుండెజబ్బులకు  భారత్ ప్రాధాన కేంద్రం!

భారత దేశం లో అనుకోకుండా గుండె పోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య  పెరగడం పై సి ఎస్ ఐ ఆందోళన.ముఖ్యంగా ఇటీవలి కాలం లో 22 సంవత్సరాల వయసులో ఉన్నవారు అనుకోకుండా గుండెపోటుకు గురై చనిపోవాదాన్ని  కార్డియో లజీ సొసైటి ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాగా అకారణంగా అర్ధాంతరంగా గుండెపోటు తో మరణించడం పై ప్రజలలో అవగాహన పెంచాలిఅని అభిప్రాయ పడింది. కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియా  లో 5౦౦౦ పై చిలుకు రిజిస్టర్ చేసుకున్న కార్దియాలజిస్ట్ లు భారాత దేశమంతా ఉన్నారని అనుకోకుండా గుండెపోటు తో అర్ధాంతరంగా గుండె పోటుతో తనువు చాలించడం పై వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియా కన్వీనర్ డాక్టర్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ ప్రివెంటివ్ కార్డియాలజీ కౌన్సిల్ చైర్మెన్ కార్డియాలజీ ఇంటర్నల్ మెడిసిన్ ఎటర్నల్ హార్ట్ కేర్ రీసెర్చ్ సెంటర్ జయపూర్ కు చెందినడాక్టర్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ పాటశాల విద్యార్ధులకు హృద్రోగసమస్యలు - వాటి తీవ్ర ప్రభావం పై అవగాహన పెరిగిన తరువాతే ఉత్తమ పోరులుగా ఎదుగుతారని గుప్తా అభిప్రాయ పడ్డారు. 

ఈ సమావేశం లో దీర్ఘకాలిక గుండె వ్యాధులకు గల కారణాలు..

వాయుకాలుష్యం ,ఒత్తిడి,ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చోవడం చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం శరీరం వ్యాయామం లేకపోవడం గుండె వ్యాధులకు గుండె పోటుకు కారణాలుగా తేల్చారు.కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియా గౌరవ కార్యదర్శి దేబబ్రత రాయ్ మాట్లాడుతూ జీవన శైలి లో మార్పులు ,శరీరానికి  వ్యాయామం లేకపోవడం. 86 % కార్బోహైడ్రేడ్స్ అత్యధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యంగా పొగాకు మద్యానికి బానిసలు  కావడం అలాగే పోస్ట్ కోవిడ్ వల్ల కొవ్వు పదార్ధాలు ఉప్పు చక్కర అధికశాతం సేవించడం అధికంగా జరగడాన్ని నిపుణులు గుర్తించారు. ఈ సమయం లోనే అంటే ఈ వయస్సు లోనే పాట శాల  విద్యార్ధులకు అవగాహ పెంచాల్సిన అవసరం జీవన శైలి లో మార్పు తోపాటు జీవన ప్రమాణం పెంచే ప్రయత్నం చేయడం ద్వారా విద్యార్ధులని సి హెచ్ డి అంటే దీర్ఘకాలిక గుండె సమస్యలనుండి బారిన పడకుండా బయట పడగలరని పేర్కొన్నారు.

నాణ్యత తోకూడుకున్న ఇంధనం వాడడం..

కాలుష్యానికి ప్రధానకారణ మైన ఇంధనం నాణ్య మైనదిగా ఉండాలని. ఈ కారణంగానే  గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని రవాణా వ్యవస్థలో మార్పు చేస్తే కొంచం మార్పు రావచ్చు దానిప్రభావం కొంత మీరైనా తగ్గవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

ఫోన్లు స్క్రీన్లకు అతుక్కుపోవడం..

కోవిడ్ తరువాత చాలామంది వ్యక్తులు ప్ర్రాదమిక వుద్యకోసం పనికోసమో వినోదం కోసమో ఎక్కువసేపు ఫోన్లకు అతుక్కుపోవడం ఈ కారణంగానే స్క్రీన్ ను చూసే సమయం ఎక్కువ ఉండడం.అది వారి వారి జీవితలాలో పెనుమార్పులు తీసుకొచ్చింది.ఈ కారణంగానే మరణాల రేటు పెర్గుతోంది. కార్డియో వాస్క్యులర్ వ్యాధులకు కారణంగా నిపుణులు తేల్చారు.

సామాజిక అసమానతలు..

సామాజిక అసమానాతలు వల్ల నిరుద్యోగం పెరగడం. నిరుపేదలు గా మారడం వల్ల ఒత్తిడికి గురికావడం. పరోక్షంగా దీర్ఘకాలంగా గుండె వ్యాధులకు దారితీస్తుంది. ఆర్ధికంగా బాధపడే నిరుపేదలుగుండెపోటు తో మరణించడం బాధాకరమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు.

అవగాహనా కార్యక్రమం అజెండా..

లక్ష మిలియన్ల ప్రజలే లక్ష్యంగా కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియాఅవగాహన కల్పించే  ప్రయత్నం చేస్తుందని  నిపుణులు ప్రకటించారు. అకారణంగా ఊహించని విధంగా యువత గుండెపోటుకు గురికావడం మరణించడం. ఇందులో శారీరక వ్యాయామ సంస్థలు,విద్యాసంస్థలు, పోలిస్స్టేషన్లు,పోస్ట్ ఆఫీసులలో అవగాహన కల్పించాలని,లేదా వర్చువల్ లర్నింగ్ ప్లాట్ ఫార్మ్స్ లేదా ఆన్ లైన్ మీడియా ద్వారా అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని సి ఎస్ ఐ అభిప్రయ పడింది.

సిపి ఆర్ లైఫ్ స్కిల్..

కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియా సిపి అర్ లైఫ్స్కిల్ ఎస్ సి డి ద్వారా పడిపోకుండా 2 1/2 పునరుద్ధరించడం ఎస్ సి డి లక్షణాలను గుర్తించిన వెంటనే వాటికి లక్షణాలను గుర్తిబ్చడం వివరించడం.అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సి పి అర అమలు చేసే విధానం పై అవగాహన కల్పించాలని నిపుణులు భావిస్తున్నారు.