మహేష్ ‘ఆగడు’.. షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ...

 

నటీనటులు: మహేష్‌బాబు, తమన్నా, శ్రుతిహాసన్ (ఐటమ్ సాంగ్), రాజేంద్ర ప్రసాద్ ,నాజర్ , సోనుసూద్, వెన్నెల కిశోర్, పోసాని, ఎమ్మెస్.

 

సాంకేతికవర్గం: సంగీతం - ఎస్.ఎస్.థమన్ , సినిమాటోగ్రఫీ - కె.వి.గుహన్, నిర్మాతలు - రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం - శ్రీను వైట్ల.

 

ఘన విజయం సాధించిన ‘దూకుడు’ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆగడు’ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి నుంచీ ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ట్రైలర్లు, సాంగ్స్ ‘ఆగడు’ మీద ఆసక్తిని మరింతగా పెంచాయి.

 

కథ: అనాథ అయిన శంకర్ (మహేష్‌‌బాబు)ని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజారావు (రాజేంద్ర ప్రసాద్) చేరదీస్తాడు. నిన్ను తప్పకుండా పోలీస్ చేస్తానని హామీ ఇస్తాడు. అయితే శంకర్ చేయని నేరానికి బాల నేరస్తుల కారాగారానికి వెళ్ళాడు. అక్కడ బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ తర్వాత తన వ్యక్తిగత సమస్యకు కారణం కావడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తిగా వున్న దామోదర్ (సోనూసూద్)ని హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ సినిమా కథాంశం.

 

నటీనటులు: మహేష్‌బాబు ప్రశంసనీయంగా నటించాడు. పంచ్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తమన్నా అందాలు ఆరబోసింది. ఒక్క పాటలో శ్రుతీహాసన్ మెరిసింది.

 

దర్శకత్వం: శ్రీను వైట్ల సినిమాని మాస్ మసాలతో పూర్తి కమర్షియల్‌గా రూపొందించారు. ‘ఆగడు’ సినిమా మహేష్ అభిమానులకు పండగ చేసుకునేలా వుంది.