ఏపీకి వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు!
posted on Sep 3, 2025 12:10PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దార్శనికత గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన దార్శనికత, ప్రగతి కాముకత గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును ప్రపంచం గమనిస్తోంది. గత జగన్ పాలనలో జరిగిన ఆర్థిక, సామాజిక విధ్వంసం నుంచి బయటపడి రాష్ట్రం ఇప్పుడు ప్రగతి పథంలో నడుస్తోంది.
ఈ విషయాన్ని ఆయన అభిమానులో, తెలుగుదేశం పార్టీ నేతలో, శ్రేణులో కాదు ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక ప్రముఖ మార్కెటింగ్ సంస్థ ఈ విషయాన్ని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యమైన అభివృద్ధి జోరందుకుందని పేర్కొన్న ఆ సంస్థ క్లీన్ ఎనర్జీ నుండి ఎలక్ట్రానిక్స్ వరకూ, చమురు నుంచి గ్యాస్ వరకు అన్ని రంగాలలోని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పోటీలు పడుతున్నాయి. వచ్చే ఐదు సంవత్సరాలలో రాష్ట్రాలనికి 45,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రానున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల కృష్టి, విశ్వసనీయతే ఇందుకు కారణమని పేర్కొంది.