ఎట్టకేలకు మాల్యా రాజీనామాకు ఆమోదం..

 

వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్యా రాజీనామాను ఎట్టకేలకు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించారు. తాను మొదటి సారి రాసిన రాజీనామా లేఖ నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా లేదని.. తన రాజీనామా లేఖలో సంతకం కూడా స్కాన్ చేసి ఉందని కారణాలతో అన్సారీ లేఖను తిరస్కరించారు. ఇప్పుడు రెండోసారి మాల్యా తన రాజీనామా లేఖను రాసి పంపించారు. అయితే ఈసారి పంపించిన లేఖ నిబంధనల మేరకు, స్వచ్ఛందంగా, బేషరతుగా రాసినదని రాజ్యసభ కార్యాలయం పేర్కొంది. ఈనేపథ్యంలో అన్సారీ మాల్యా రాజీనామా లేఖను ఆమోదించారు.