శ్రీహరికి టాలీవుడ్ ఘననివాళి.. జూనియర్ కంటతడి

 

 Tollywood Condolences To Srihari Srihari passes away, Telugu actor Srihari, actor Srihari passes away

 

 

తెలుగుతెర రియల్ స్టార్ శ్రీహరి బౌతికఖాయానికి నివాళులు అర్పించడానికి తెలుగు సినీ పరిశ్రమ తరలివచ్చింది. అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్జీఆర్, దర్శకుడు వంశీ పైడిపల్లిలు ఆవేదన ఆపుకోలేక కంటతడి పెట్టడంతో ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించిన వారిలో కేంద్ర మంత్రి చిరంజీవి, రాంచరణ్ తేజ, దిల్ రాజు, నల్లమల్లపు బుజ్జి, సుమన్, పరుచూరి గోపాలకృష్ణ, సుమన్, కృష్ణం రాజు, తరుణ్, వందేమాతరం శ్రీనివాస్, జగపతిబాబు, ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి. హనుమంతరావు దాసరి నారాయణ రావు, వేణుమాధవ్ తదితరులు ఉన్నారు.

 

 

శ్రీహరి అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని ఫాంహౌస్‌లో జరుగుతాయి. అంతకుముందు ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్‌లో ఉంచనున్నారు. శ్రీహరి పార్థివ దేహానికి  బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన కూతురు అక్షర సమాధి పక్కనే అంత్యక్రియలు జరుపుతున్నట్లు దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సికల్యాణ్‌ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu