అక్టోబర్ 13న మసాలా పాటలు

 

వెంకటేష్, రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "మసాలా". విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్, సురేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి, షాజన్ పదాంసీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ 13న నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.