తమిళనాడు ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు..

 

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలనుండి ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం ఆరు గంటల వరకూ జరగనున్నాయి. ఎంతో రసవత్తరంగా సాగే ఈ ఎన్నికల్లో సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తోపాటు పలువురు తమ ఓటును వినియోగించుకున్నారు.

 

కాగా తమిళనాడులో 232 అసెంబ్లీ స్థానాలకు 3,776 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా 5,82,59,801 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 

 

రజనీకాంత్ స్టెల్లా మేరీస్ కాలేజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

మొదట ఓటు వేయడం కుదరదేమోనని తెలిపిన కమల్ చివరికి తన ఓటును వేశారు. తేయనమ్ పేటలోని కార్పొరేషన్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమల్ తోపాటు కూతురు అక్షర హాసన్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు.

అజిత్ తన భార్య శాలినితో కలిసి కుప్పం బీచ్ రోడ్ లోని గవర్నమెంటు స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నీలంకరైలో విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సూర్య ఫాదర్ శివ కుమార్, ఆయన సోదరుడు కార్తి, ఇతర కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇంకా పలువురు జీవా, వివేక్, కుష్బూ, రాధిక కూడా తమ ఓటు హక్కును వినియోగించకున్నారు.


Online Jyotish
Tone Academy
KidsOne Telugu