టీఎస్‌ఆర్టీసీలో తొలి సమ్మెసైరన్..!
posted on May 16, 2016 3:28PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేసింది. వేతన సవరణ తర్వాత చెల్లించకుండా మిగిలిపోయిన బకాయిల్లో 50 శాతం మొత్తానికి బాండ్లు ఇవ్వాలని, మిగతా మొత్తం తక్షణం విడుదల చేయాలని, కొత్త డీఏను, నాలుగేళ్లుగా ఆగిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్లను చెల్లించాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించింది. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లతో పాటు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్, బహుజన వర్కర్స్ యూనియన్‌లు సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.