డ్రైనేజ్ లో పడిన మహిళా ఎంపీ.. తీవ్ర గాయాలు..
posted on May 16, 2016 2:56PM

గుజరాత్‌లోని జామ్‌నగర్ నియోజకవర్గ బిజెపి ఎంపీ పూనమ్ మాదమ్.. డ్రైనేజీ కుప్పకూలిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం.. ఎంపీ పూనమ్ మాదమ్ గుజరాత్ లో జలారామ్ నగర్ లోని ప్రజలు, అధికారులతో అక్కడి సమస్యలు.. తెలుసుకోవడానికి వెళ్లారు. అంతేకాదు డ్రైనేజీ చుట్టూ కట్టిన అక్కమ కట్టడానికి తొలగించేందుకు జామ్‌నగర్ మున్సిపాలిటీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి వెళ్లిన ఆమె ఓ డ్రైనేజీ కప్పుపై నిలబడి మాట్లాడుతుండగా.. సడెగా అది కుప్పకూలిపోయింది. దాదాపు 10 ఫీట్ల లోతు ఉన్న ఈ నాలాలో పూనమ్ మాదమ్ పడిపోవడంతో ఆమె కాలికి.. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా డ్రైనేజీలో పడిపోగా వారిని కూడా ఆస్పత్రికి తరలించారు.