రాజీనామాల అవసరం లేదు: జేసీ

 

seemandhra udhyamam, jc diwakar reddy, SEEMANDHRA AGITATION congress

 

 

రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసేందుకు సీమాంధ్ర నేతలంతా సిద్దంగా వున్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే ప్రస్తుతం రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బిల్లును శాసనసభలో తీర్మానాన్ని ఓడించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వం పడిపోయే స్థితి లేనందువల్ల ఎంపీలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, ఎంపీలు రాజీనామా చేసిన తమపై ఒత్తిడి రాదని అన్నారు.

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినందువల్లనే రాజీనామాలపై వెనక్కి తగ్గినట్లు రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. అందరం కలిసి త్వరలో నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రితో మళ్లీ రాజీనామాల అంశంపై మాట్లాడుతామని ఆయన చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu