ఎన్ఐసీ నుంచి చంద్రబాబు నాయుడు వాకౌట్

 

PM addresses NIC meeting, chandrababu NIC meeting, delhi NIC meeting

 

 

దేశంలో భద్రతాచర్యలపై ఇవాళ ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం జరిగింది. ఈ సమావేశాన్ని హాజరైన చంద్రబాబు వాకౌట్ చేశారు. సమావేశంలో తెలుగువారికి అవమానం జరిగిందని, అందుకే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశామని చంద్రబాబు ఆవేదనగా పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవద్దని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం అడ్డుకున్నారని అన్నారు.

 

 

అస్సాం రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఎన్ఐసీలో అవకాశం కల్పించారని అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో ఎలా పోరాటం చేయాలో తెలుసునని, అలాగే ఢిల్లీలో కూడా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu