బలుపు వేరు..వాపు వేరు: దాసరి
posted on Jun 3, 2013 7:04PM

హీరో రవితేజ నటిస్తున్న ‘బలుపు’ చిత్రం ఆడియో ఫంక్షన్ లో దర్శకరత్న దాసరి నారాయణ రావు రవితేజని పొగడ్తలతో ముంచెత్తాడు. “సినీ పరిశ్రమలో నాకన్న ‘బలుపు’న్న వారు ఎవరూ లేరు. అందరూ వాపునే బలుపు అనుకుంటారు. కానీ వాపు వేరు బలుపు వేరు. ‘బలుపు’ టైటిల్ నాకు నచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థకు ఇది మొదటి సినిమా. భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తయిన సంధర్భంగా మొదలయిన ఈ సంస్థ వందేళ్లు కొనసాగాలి. ఇలాంటి సంస్థలు చిత్ర పరిశ్రమలోకి వస్తే సినీ పరిశ్రమ కలకలలాడుతుంది. హీరో రవితేజ అంటే నాకు ఇష్టం. చిన్న వేశాలతో పరిశ్రమలోకి వచ్చి స్వయంకృషితో ఎదిగాడు. రవితేజ చిత్ర పరిశ్రమకు అవసరం అని, ఆయన రెండు లేదా మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాత లాభపడతాడని''అని దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు.ఈ నెల 21 న రిలీజ్ కావడానికి సిద్దమవుతున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని డైరెక్టర్. శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.