దీక్షాసేత్ కి లక్కీఛాన్స్
posted on Jun 3, 2013 5:32PM

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హిట్ లేక సతమతమవుతున్న హీరోయిన్ దీక్షాసేత్ కి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. వేదం సినిమాతో టాలీవుడ్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ సెంకండ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, ఒకటి, రెండూ సినిమాల్లో మొయిన్ హీరోయిన్ గా నటించినా సరైన విజయం దక్కక పోవడంతో సినిమాల్లో తీసుకోవడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారు. అయితే ఈమెకు సడన్ గా బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. రణబీర్ కపూర్‌లకు వరుసకు సోదరుడయ్యే ఆర్మన్ జైన్ హీరో గా, సైఫ్ ఆలీఖాన్ నిర్మాతగా, ఆరిఫ్ అలీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో దీక్షాకు హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు కూడా బాలీవుడ్ కి వెళ్ళే హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. పంజాబీ భామ దీక్షా సేథ్‌కి టాలీవుడ్ దక్కని విజయాలు బాలీవుడ్ లోనైనా దక్కుతాయో లేదో చూడాలి.