రామ్ చరణ్ మ్యాటర్ సెటిల్
posted on Jun 27, 2013 5:24PM
.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ 'జంజీర్' కి కష్టాలు తొలగిపోయాయి. కాపీ రైట్ కోర్ట్ కేసులతో సతమతమవుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది. ఎలాగా అనుకుంటున్నారా...ఇప్పుడు ఏకంగా ఈ సినిమా నిర్మాతే మారిపోయాడు! అవును మరి.. ఈ సినిమాని స్టార్ట్ చేసిన నిర్మాణ సంస్థ అమిత్ మెహ్రా కంపెనీ స్థానంలో ఇప్పుడు రిలయన్స్ పార్టనర్ షిప్ తో ప్రకాష్ మేహ్రా ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేయబోతుంది. ఎందుకంటే అమిత్ మెహ్రా సోదరులకు మనీ చెల్లించడంలో విఫలమయ్యారు. ఇంకా కొంచెం వివరాల్లోకి దిగితే అమిత్ మెహ్రా, ప్రకాష్ మేహ్రా వరసకి అన్నదమ్ములే కానీ వ్యాపారం వ్యాపారమే కదా! ఇప్పుడు జంజీర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతో౦ది. జూలైలో ప్రచారానికి ఈ సినిమా యూనిట్ రెడీ అవుతోంది. సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు.