రవితేజ 'బలుపు' పబ్లిక్ టాక్
posted on Jun 28, 2013 1:08PM

మాస్ మహారాజ రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. టాలీవుడ్ మినిమ౦ గ్యారెంటీ హీరోగా పేరు పొందిన మాస్ రాజా టైం గత రెండు సంవత్సరాలుగా ఏమి బాగాలేదు. వరుస పరాజయాలు రావడంతో ప్రొడ్యూసర్ లు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తిగా లేరూ. ఈ సమయంలో ఆయన నటించిన తాజా మూవీ 'బలుపు' ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీంతో రవితేజకు టెన్షన్ ప్రారంభమైంది.
ఈ మార్నింగ్ షో తరువాత ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకుంటే...రవితేజ 'బలుపు' తో మళ్ళీ ఫాంలోకి వస్తాడని అ౦టున్నారు. ఈ సినిమాలో మాస్ రాజా తన మార్క్ యాక్షన్ తో అభిమానులను ఆకట్టుకున్నాడని తెలుస్తోంది. సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా...కామెడీసీన్లు, స్క్రీన్ ప్లేతో కవర్ చేసాడనే టాక్ వినిపిస్తోంది. అయితే తొలి రోజు గడిస్తే గానీ అన్నివర్గాల ప్రేక్షకుల అభిప్రాయాలు వెల్లడయ్యే అవకాశం లేదు. రవితేజ ఈ సినిమా పై పూర్తి నమ్మకంతో వున్నాడు.