'బాహుబలి' నిజాలు బయటపెట్టిన రాజమౌళి
posted on Jun 27, 2013 12:46PM
.jpg)
రాజమౌళి 'బాహుబలి' సినిమా పై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తన సోషల్ నెట్విర్కింగ్ ద్వారా రాజమౌళి ఈ వార్తలను ఖండించారు. ఈ సినిమాకు ఐమ్యాక్స్ ఫార్మాట్ కెమెరాలను ఉపయోగిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. అతని అన్ని సినిమాలకూ వాడినట్టుగానే అలెక్సా ఎక్స్ టీ కెమెరాలనే వాడనున్నట్లు రాజమౌళి స్పష్టం చేశాడు. అలాగే ఈ సినిమా బడ్జెట్ విషయంలోని పుకార్లను కూడా రాజమౌళి ఖండించారు. కేవలం మూడు రోజుల షూటింగ్ కు పది కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారన్న ప్రచారం ఫాల్స్ అని ఆయన స్పష్టం చేశారు. తాము ఈసినిమాకు భారీగా ఖర్చు పెడుతున్న విషయం వాస్తవమే అయినా..దాన్ని తెలివిగా ఖర్చు పెడుతున్నాం తప్ప… పిచ్చి పట్టినట్టు ఖర్చు చేయడం లేదని ఈ దర్శకుడు స్పష్టం చేశాడు. బాహుబలి జూలై ఆరు న సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. గత ఏడాది జూలై ఆరున ఈగ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సెంటిమెంటుతో ఈ సినిమాకు క్లాప్ కొడుతున్నారని తెలుస్తోంది.