షీనా హత్య కేసు మరో ట్విస్ట్.. దర్యాప్తు అధికారి భార్య దారుణ హత్య..

 

షీనా బోరా హత్య  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇప్పటికే  షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ.. ఆమె మాజీ భర్త సంజీవ్‌ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. షీనాబొరా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ధ్యానేశ్వర్‌ గనోర్‌ భార్య హత్యకు గురయ్యారు. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల్లో ముంబై పోలీసు అధికారి ధ్యానేశ్వర్ గనోరె ఒకరు. అయితే ఆయన భార్య ముంబైలోని శాంతాక్రజ్ లో దారణ హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం పక్కన కత్తి కనిపించడంతో... ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా.. నిన్న సాయంత్రం నుంచి ధ్యానేశ్వర్‌ 21ఏళ్ల కుమారుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దీంతో ఇప్పుడు ఈ హత్య సంచలనం రేపుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu