'ప్రభాస్' మెరుపులా మెరిశాడు
posted on Oct 23, 2013 5:24PM
టాలీవుడ్ క్రేజియస్ట్ కాంబినేషన్ లలో ఒకటి రాజమౌళి, ప్రభాస్ లది. ‘ఛత్రపతి’లో ప్రభాస్‌ని రాజమౌళి ప్రెజెంట్ చేసిన తీరును ఎవరూ మర్చిపోరూ. ఇప్పుడు ‘బాహుబలి’ సినిమా కోసం రాజమౌళి.. ప్రభాస్ మళ్ళీ కలిశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ప్రభాస్ గెటప్ ఎలా వుంటుంది.? ఎలా చూపించబోతున్నాడు? అని అనుకుంటున్న అభిమానులకి, ‘బాహుబలి’ మేకింగ్ టీజర్‌తో మంచి ట్రీట్ ఇచ్చాడు రాజమౌళి.
ఈ వీడియో లో జస్ట్ అలా చిన్న మెరుపులా మెరిశాడు ప్రభాస్..అయితేనె౦..ఆ గెటప్ లో రాజసం ఉట్టిపడేలా..కోరలు తిరిగే మీసం తో శత్రువుల్ని చండాడే యోధుడిలా వున్నాడు. మొదటిసారిగా ప్రభాస్ ని అలా రాజు గెటప్ లో చూస్తుంటే అభిమానులకు పండగే. ప్రభాస్ చిన్న గెటప్ ఇలా వుంటే, అసలు సినిమా ఇంకే రేంజ్‌లో వుండబోతోందో.!