త్వరలోనే ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్లి..!

 

హీరో శరత్ కుమార్ కూతురు, కోలీవుడ్‌ హీరోయిన్ వరలక్ష్మి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. అయితే ఈ అమ్మడు గతకొద్ది రోజులుగా హీరో విశాల తో ప్రేమాయణం సాగిస్తుంది. అయితే ఇదే విషయంపై కోలీవుడ్ లో పలు పుకార్లు షికారు చేసి, చివరకు వీరి పెద్దల వరకు చేరింది. ఐతే వీరి ప్రేమకు మొదటగా శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో శరత్‌కుమార్ భార్య రాధిక దగ్గరుండి మరీ ఈ పెళ్లికి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. ఇటీవలే విశాల్ కూడా త్వరలోనే తాను ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఒక సందర్భంలో వెల్లడించాడు. దీనిని బట్టి వరలక్ష్మిని విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని తెలుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu