పవర్ స్టార్ ''1'' వన్ స్టార్
posted on Oct 17, 2013 6:57PM
.jpg)
‘అత్తారింటికి దారేది’ సినిమాతో సంచనాలు సృష్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గబ్బర్‌సింగ్ తో కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే యాభై కోట్లకి పైగా షేర్ సాధించిన పవన్‌కళ్యాణ్‌కి ఈ ఏడాది కూడా ఆ ఘనత దక్కింది. కేవలం మన రాష్ట్రంలోనే యాభై కోట్లకి పైగా షేర్ సాధించిన ‘అత్తారింటికి దారేది’ ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.
ఈ చిత్రానికి మొదటి వారం వచ్చిన వసూళ్ళు చూసి ‘మగధీర’ రికార్డుని బద్దలు కొట్టడం ఖాయమని అనుకున్నారు సినీ విశ్లేషకులు. కాని ఆ తరువాత సీమాంధ్రలో జరిగిన బంద్ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. దానికి తోడూ రెండో వారంలో జూనియర్ ఎన్టీఆర్ ''రామయ్యా వస్తావయ్యా'' రిలీజ్ కావడంతో టాప్ 2తో సరిపెట్టుకుంటుందని అనుకున్నారు.
కాని ఇప్పుడు అందరి అంచనాలు తారుమారయ్యాయి. ‘రామయ్య’ మెప్పించకపోవడంతో...పండుగ వేళ ‘అత్తారింటికి దారేది’ వసూళ్లు ఒక్కసారిగా మళ్ళీ పికప్ అయ్యాయి. దీంతో ఈ వారాంతానికి డెబ్భెయ్ కోట్ల మార్కుని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కలెక్షన్స్ డ్రాప్ అవకుండా స్టడీగా షేర్లు రాబట్టినట్టయితే అబ్బాయ్ రికార్డుని బాబాయ్ బద్దలు కొట్టడం ఖాయం.