శ్రీహరి పాత్రలో సాయి కుమార్
posted on Oct 18, 2013 12:13PM

మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం"ఆగడు". ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటికే పక్కాగా స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన శ్రీను వైట్ల త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రలో నటుడు శ్రీహరి ని తీసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. కానీ శ్రీహరి అకాల మరణం చెందటంతో ఆ పాత్రలో సాయి కుమార్ ను తీసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పాటల కంపోసింగ్ ను సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే మొదలుపెట్టేశాడు. ఎలాగైనా ఈ చిత్రాన్ని "దూకుడు" కంటే మరింత బ్లాక్ బస్టర్ హిట్టయ్యే సాంగ్స్ ఇవ్వాలని థమన్ ఆశిస్తున్నాడు.