శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం... అధికార పోరు..

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళనాట రాజకీయాలు రోజుకో సరికొత్త మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి.. శశికళ నటరాజన్ సీఎం పీఠాన్ని అధిరోహించే క్రమంలో ఇప్పుడు మరీ రసవత్తరంగా మారాయి రాజకీయాలు. సీఎంగా ప్రమాణా స్వీకారం చేయాల్సిన శశికళ ఇప్పటివరకూ చేయలేదు...తాజాగా మరో ఆసక్తికరమైన పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్ధితి శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం లా తయారైంది. ఎవరి వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారన్న విషయంపై ఇప్పటికే పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 235 అసెంబ్లీ స్థానాలుండగా.. అందులో ముందు 50 మంది ఎమ్మెల్యేలు పన్నీరుకు మద్దతు పలకగా మరో పన్నెండు మంది వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఇక అన్నాడీఎంకే నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాత్రం శశికళ నటరాజన్‌కు 134 మంది ఎమ్మెల్యేల మద్దుతుందని  చెప్పారు. శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం తథ్యమన్నారు. అంతేకాదు పన్నీర్‌సెల్వం వెనుక డీఎంకే ఉందని తంబిదురై ఆరోపించారు. మొత్తానికి శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ పోరులో ఎవరి నెగ్గుతారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu