ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు చంద్రబాబు
posted on May 6, 2013 3:32PM
.jpg)
పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు సైతం పాల్గొంటారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావల్సిందిగా చంద్రబాబు నాయుడుకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఫోన్ చేశారు.
చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ ఎంపీలు ఈ రోజు స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాబుకు ఆహ్వానం పంపకపోవడంపై తాము తీవ్ర మనస్తాపం చెందామని అన్నారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి ఆహ్వాన లేఖను చంద్రబాబుకు నివాసానికి పంపించారని, దానిని వారు తిరస్కరించారని, తర్వాత టిడిపి భవన్‌కు పంపినట్లు ఆమె చెప్పారని స్పీకర్ తెలిపినట్లు సమాచారం.