దొంగల పార్టీలో దాడి ఎలా చేరతారు: కొణతాల
posted on May 6, 2013 12:07PM

దాడి వీరభద్రరావుపై వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కొణతాల లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో దాడి చేశారు. దాడి వీరభద్రరావు క్యారెక్టర్‌లేని మనిషి. ఆయన రాకతో వైసీపీ సర్వనాశనం అవుతుంది. "టీడీపీ అధికారంలో ఉండగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. కొణతాల రామకృష్ణ ఏనాడూ పదవులకోసం పాకులాడలేదు. 2009లో ఎన్నికల్లో ఆయన ఓడినప్పటికీ వైఎస్ పదవి ఇస్తానన్నప్పటికీ... సున్నితంగా తిరస్కరించారు. కానీ దాడి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసి 24 గంటలు గడవకముందే జగన్ వద్దకు వెళ్లి పదవికోసం బేరం పెట్టారు'' అని విరుచుకుపడ్డారు. దాడి అనుచరులంతా టీడీపీలోనే ఉన్నారని... ఆయన అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీలతో రాజకీయాలు చేసే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీని దొంగల పార్టీ అని తీవ్ర స్థాయిలో విమర్శించిన దాడి వీరభద్రరావు ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా చేరతారని ప్రశ్నించారు.