మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేం : జైళ్ల శాఖ

 

 

ఏపీ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కల్పించే సౌకర్యాలపై దాఖలైన పిటిషన్‌పై  జైళ్ల శాఖ తాజాగా స్పందించింది. ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జైలులో ఆయనకు ఇంటి భోజనం అనుమతించలేమని.. అటెండర్‌ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ పేర్కొంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని మిథున్‌రెడ్డిని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. మిథున్‌రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.

 జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వెస్ట్రన్ కమోడ్‌తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సహాయకుడు, అవసరమైన మందులు, మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్, పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టెలివిజన్‌ను అనుమతించాలని కోర్టు పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu