రామ్ చరణ్ తప్పించుకున్నాడు
posted on May 6, 2013 10:30AM

పదవుల్లో ఉండేది మనవాళ్లే అయితే తప్పు మనదైనా తప్పించుకోవచ్చు. ఇది మరోసారి మీడియా సాక్షిగా రుజువైంది. ఈ మధ్యాహ్నం వీకెండ్ మూడ్ లో రాంచరణ్ బంజారాహిల్స్ లో తన ఆస్టిన్ మార్టిన్ కారుతో విహరిస్తున్నారు. పాపం కోట్ల రూపాయల విలువైన సారు కారు కదా.. బుల్లి ఆల్టో అడ్డమొస్తే కోపం రాదా.. అలాగే వచ్చింది. అంతే ఆస్టిన్ మార్టిన్ అడ్డమొచ్చినందుకు పాపం ఆ వ్యక్తి హీరో చేతిలో తన్నులే తినాల్సి వచ్చింది. హీరో అయితే మాత్రం నన్ను కొట్టేస్తాడా అంటూ ఆ బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తీరా రెండు గంటల్లో గల్లీ నుంచి డ్రామా ఢిల్లీ చేరి అక్కడ్నుంచి రివర్సులో బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో ముగిసింది. తండ్రేమో కేంద్రమంత్రి, మామ పారిశ్రామిక వేత్త… మరి ఈ చిన్న కేసును కూడా మేనేజ్ చేయలేకపోతే ఇక పదవులెందుకు? పవరెందుకు? అంతే… మూడు నాలుగు ఫోన్ కాల్స్ కాసింత క్యాష్ తో పనైపోయింది.