మంత్రి గంటా రాజీనామా
posted on Feb 18, 2014 1:45PM

కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాష్ట్ర ఓడరేవులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని గంటా తొలుత నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గతంలో మంత్రి పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు. దానిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదించలేదు. గంటా శ్రీనివాస రావు తన రాజీనమా లేఖను గవర్నర్ నరసింహన్‌కు ఫాక్స్ ద్వారా పంపించారు. గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు.