గీతికా శర్మ ఆత్మహత్య కేసు: కందాకు బెయిల్

 

 Geetika Sharma suicide case, Gopal Kanda gets interim bail, Geetika Sharma Gopal Kanda

 

 

మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. సంవత్సరం నుంచి జైలులో వుంటున్న కందాకు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు వీలుగా కోర్ట్ నెల రోజుల పాటు బెయిల్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కందా తరఫు లాయర్ రమేష్ గుప్తా వాదించారు. గోపాల్ కందా సిర్సా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఇతను తన ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరముందని, నియోజకవర్గానికి వచ్చిన నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లాయర్ చెప్పారు. ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి ఎంసి గుప్తా అంతకుముందు కందా బెయిల్ పిటిషన్‌ను రిజర్వ్‌లో ఉంచారు. ఇరు వైపుల వాదనలు విన్న అనంతరం బెయిల్ ఇచ్చారు.